ఆవేశంగా ఉన్నప్పుుడు, నిర్ణయాలు తీసుకోవడం, ఆనందంగా ఉన్నప్పుడు, ఆలోచించకుండ మాట ఇవ్వడం చాలా ప్రమాదకరం.

ఈ రోజూ నేను ఆనందంగా ఉంటాను. ఎది ఏమైనా సరే ఎండైనా వానైనా,కలిమిలములైనా, భోజనం దొరికిన దొరక్కపోయినా ఆనందంగానే ఉంటాను అని అనుకోవాలి.

ఉపాధ్యాయుడు నిరంతరం నేర్చుకుంటూ, ఉంటే తప్ప ఇతరులకు బోధించలేడు.దీపం వెలుగుతూ ఉంటే తప్ప మరో దీపాన్ని వెలిగించలేదు.

విద్య జ్ఞానాన్నిస్తుంది.విలువలు సత్ప్రవర్తననిర్మాణానికి పునాదులు వేేస్తాయి.విశాల మానవప్రపంచం గురించి ఆలోచింపజేసే మరింత ముందుకు నడిపిస్తుంది ధైర్యం.

ఒక గొప్పపుస్తకం చదివినప్పుడు ఓకొత్త స్నేహితుడు దొరికినంతా సంబరమూ, దాన్ని మళ్ళీ చదివినప్పుుడు చిరకాల మిత్రుణ్ణి కలిసినంతా ఆనందం కలుగుతుంది.

బుద్ధివంతుడైనవాడు ముందు తనలోనే అవగుణాలు గుర్తించి సరిదిద్ధుకుంటాడు. ఆ తరువాత ఎదుటివారి సద్గుణాలు గుర్తించి స్వంతం చేసుకుంటాడు.

గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవాలి. వారి ఆలోచనలనుండి స్ఫూర్తి పొందుతూ వుండాలి, అప్పుడే వారి లక్షణాలు మనకు వస్తాయి.

నీటి బిందువు కాలుతున్న పెనం మీద పడితే రూపురేఖలు లేకుండా ఆవిరవుతుంది.తామరాకు మీద పడితే అంటీ అంటకుండా వుంటుంది.ముత్యపు చిప్పలో పడితే ముత్యమై మెరుస్తుంది.అలాగే, మనిషి నీచుడి నీడ చేరితే నశిస్తాడు. మధ్యముడి వెంట ఉంటే ఆ మాత్రపు ప్రతిష్ఠనే పొందుతాడు. ఉత్తముడిని ఆశ్రయిస్తే ఉజ్వలంగా వెలుగుతాడు.

విద్య వినయాన్ని పెంపొందించాలి. వినయం లేని విద్య వ్యర్థం, విద్య వినయంతో కూడినప్పుడే అహంకారం నుండి తప్పించుకోగలుగుతారు.స్థితి పెరుగుతున్న కొద్దీ అణుకువ, వినయం పెంచుకునే కొలది శాంతి లభిస్తుంది.

పరుల మేలు కోసం చేసిన పని ఎంత చిన్నదైనా అది మనలోని అంతశ్శక్తిని మేలుకొల్పుతుంది. ఇతరులకు కాస్త ఉపకారాన్ని ఊహించటం సైతం హృదయంలో సింహబలాన్ని నెలకొల్పుతుంది.

మనం పక్షుల్లా గాలిలో ఎగరడం, చేపల్లా నీటిలో ఈదడం నేర్చుకున్నాము. కానీ భూమిపై మనుషుల్లా ఎలా జీవించాలో మనకు తెలియడం లేదు.

మనషులు రెండు రకాలు.... పని చేసే వాళ్ళు, గొప్పలు చెప్పుకునే వాళ్ళు మొదటి వారితో ఉండటమే నయం, అక్కడ పోటీ తక్కువ.

కష్టాలను జయించడానికి నిస్పృ కన్నా చిరునవ్వు బలమైన ఆయుధం.
మీరు అత్యంత ఆనందాన్నిచ్చే ఉద్యోగం లేదా ఉపాధిని ఎన్నుకోండి. జీవితంలో ఒక్కరోజు కూడా 'మీరు 'పని'చెయ్యాల్సిన అవసరం లేదు.

మనసుపెట్టి పని చేస్తే, ఏ వృత్తిలో,ఏ పనిలోనైన కలిగే తృప్తే మనిషికి ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. అప్పుడు ఆకలి, నిద్ర అసలు గుర్తుకు రావు.

కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తెలివి హీనతో , సహనం వహిస్తున్నారు కదా అని ఉత్తములను తక్కువగా అంచనా వేయడమూ అంతే.

ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు. కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు.

మనకు కావలసింది శ్రద్ధ... మనిషికీ మనిషికీ మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే గాని వేరేమి కాదు. ఒక మనిషిని గొప్పవాడుగాను; ఇంకొకరిని బలహీనుడుగాను, అధముడుగాను చేసేది శ్రద్ధే... (అంటే శ్రద్ధలో వ్యత్యాసమే) కాబట్టి శ్రద్ధ మీలో పాడుకోవాలి.
మనకు కావలసింది శ్రద్ధ... మనిషికీ మనిషికీ మధ్య తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే గాని వేరేమి కాదు. ఒక మనిషిని గొప్పవాడుగాను; ఇంకొకరిని బలహీనుడుగాను, అధముడుగాను చేసేది శ్రద్ధే... (అంటే శ్రద్ధలో వ్యత్యాసమే) కాబట్టి శ్రద్ధ మీలో పాడుకోవాలి.

విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నావారు .విజయం సాధించితీరుతారు.అన్నివేళ్ళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు. అపజయం మరణమూ కాదు.రెండిటికంటే ముఖ్యమైనది ధైర్యం.

నిరాడంబరమైనా తేనెటీగ అన్నిరకాల పుష్పలనుంచి తేనెను తీసుకునట్టే తెలివి కలవాడు అన్ని పవిత్ర గ్రంథాల నుండి సారాన్ని గ్రహిస్తాడు.

మీరు ప్రతి రోజూ తృప్తిగా నిద్రించాలంటే, ప్రతి ఉదయమూ ఒక చక్కటి సంకల్పంతో నిద్ర లేవటం అలవాటు చేసుకోండి.

తన ఙ్ఞాపకాలతోనే జీవించేవాడు వృద్ధుడు అవుతాడు. భవిష్యత్తు గురించి ప్రణాళికలతో జీవించేవాడు నిత్య యవ్వనంతో ఉంటాడు.

ప్రతి వ్యక్తి తన విద్యుక్త ధర్మాన్ని తాను త్రికరణ శుధ్ధిగా నెరవేెరుస్తుండాలి. సుఖ దు:ఖాలు రెండిటిలోనూ సమాన బుధ్ధిని కలిగి ఉండాలి. అదే ఉత్తమ యోగం దీనిని సాధించినవాడు ఉత్తమయోగి.

మనిషి ఎప్పుడూ తనకున్న సంపదతో తృప్తి పడాలి: కానీ తనకున్న విజ్ఞానంతో తృప్తి పడకూడదు.
ఇతరులకు మేలు చేయడం ఒక కర్తవ్యం కాదు. అది ఒక సంతోషం. ఎందుకంటే అది నీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొదిస్తుంది.

ఎవరైనా ఒక దానిని నిజంగా, మనసారా ఇష్టపడితే దానిని పొందకోకుండాఆపే శక్తి ఈ విశ్వాసంలో లేదు.

జీవితంలో సంతృప్తిపడే వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అసంతృప్తిగా జీవించే వ్యక్తి నిరంతరం దు:ఖంలో ఉంటాడు.

జీవితంలో సంతృప్తిపడే వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అసంతృప్తిగా జీవించే వ్యక్తి నిరంతరం దు:ఖంలో ఉంటాడు.
ప్రేమగా ఇష్టంగా చేసేటప్పుుడు ఆ పనితనం చాలా గొప్పుగా ఉంటు ంది.మీకు దక్కాల్సిన ఫలం దక్కుతుంది.ఒక వేల వద్దానుకున్నా ఆ
ఫలం మీ పాదాలవద్దకు వచ్చి చేరుతుంది.

ఎంత విషమ పరిస్థితులెదురైనా మంచితనం,మానవత్వాల్లో నమ్మకాన్ని పోగొట్టుకోకుడదు. కాసిని మురికి నీళ్ళు ఉన్నంత మాత్రానా సముద్రం మురికి కూపం అవుతుందా.

ఎళ్ళ తరబడి నీళ్ళలోన ఉన్న రాయి మెత్తబడదు. ఎన్ని కష్టాలు చు ట్టు ముట్టినా ధీరులు ఆత్మావిశ్వాసం కోల్పోరు.

ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో అంతేకాని తీసుకోవడం కాదు.
అలాగే ఇతరులకు సేవ చేయడం నేర్చుకో పెత్తనం చేలాయించడం
కాదు.

దయ ఎన్నడూ వృధా కాదు. దాని పొందే వాడి మీద అది ఏ ప్రభావ ము చూపకపోయినా కనీసం దాని ఇచ్చే వాడికైనా అది మేలు చేస్తుంది.

జీవితం అశాశ్వతం అనేది జీవన సత్యం. ప్రతిరోజూ ఎవరో ఒకరు మరణించడాన్ని ప్రజలు చూస్తునే ఉంటారు. అయినా, శాశ్వతమన్నట్ల్లుగా జీవిన్తూవుంటారు.

ఎందుకోగానీ ఈ ప్రపంచంలో ఉపదేశాలంటే ఎవ్వరూ ఇష్టపడరు. నిజానికి వాటి అవసరం ఎక్కువగా ఉన్నవారు. వాటిని తక్కువగా ఇష్టపడుతుంటారు.
మంచి పనులు చేసేవారు ఎంత గొప్పవారైనా, వారి గురించి తెలిసే దాకా ప్రజలు వారు చెప్పే ఒక ముక్కయినా వినరు.

మనిషిదీపమైనా కావాలి. అద్దమైనా కావాలి, ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి ప్రతిభింభిస్తుంది. ప్రతి వారు దీపం కాకపోవచ్చు, కాని అద్దం కాగలరు. తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడమే జీవితం.

బోధకుడుగా వుండాలని కోరే ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలనే నూరి పోయకుండా, మనస్సులకు
ఉత్తేజాన్ని కలిగించేలాగ లక్ష్యం ఉండాలి.

No comments:
Post a Comment